ఎన్‌కౌంటర్‌లో నలుగురు టెర్రరిస్టుల కాల్చివేత

                                                                                                        అనంత్‌నాగ్ : జమ్ము కశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లాలో ఆదివారం ఉదయం భద్రత దళాల కాల్పుల్లో నలుగురు టెర్రరిస్టులు చనిపోయారు. ఆదివారం ఉదయం అనంత నాగ్ జిల్లాలోని వత్రిగ్రాం గ్రామంలో పోలీసులు, భద్రతా దళాల ఓ యూనిట్ సంయుక్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో నలుగురు అనుమానితులను విచారణ చేస్తుండగా వారు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులతో పాటు భద్రతా దళాలు ఎదురు కాల్పులు చేయడంతో ఆ నలుగురు చనిపోయారు. చనిపోయిన వారి పూర్తి వివరాలు అధికారులు ఇంకా వెల్లడించలేదు.


 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు