తూర్పున అదుపులో 236 మంది
తూర్పు గోదావరి ;కోవిడ్ 19 నివారణలో భాగంగా లో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా ఎస్పి శ్రీ అద్నాన్ నయీం అస్మి గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా సరిహద్దులలో మరియు ఇంటర్ స్టేట్ సరిహద్దులలో కూడా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం అందరికి తెలిసిందే. దీనిలో భాగంగా ఈ రోజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు అయిన సిద్ధాంతం బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేయబడిన చెక్ పోస్ట్ వద్ద జరిగిన తనిఖీలలో తెలంగాణ రాష్ట్రం మరియు ఇతర ప్రాంతాల నుండి నిబంధనలకు విరుద్ధంగా వచ్చుచున్న 236 నందిని అదుపులోకి తీసుకొని, వారిని స్థానిక డి.ఎస్.పి, ఆర్. డి.ఓ. గార్ల నేతృత్వంలో మెడికల్ పరీక్షల నిమిత్తం బొమ్మూరు లో గల ప్రభుత్వ క్వారంటైన్ కు తరలించారు, వారి వద్ద నుండి 28 కార్లు , 55 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పి శ్రీ అద్నాన్ నయీం అస్మి గారు మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంగించినట్లయితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటా మని ఎవరినీ ఉపేక్షించేది లేదని, అందరూ తదుపరి ఉత్తర్వుల వరకు ఈ లాక్ డౌన్ కు కు సహకరించాలని తెలియజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి