
కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించింది. కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ మూడు వారాలను మీ జీవితంలో మర్చిపోండని దేశ ప్రజలను కోరారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అని ప్రధాని మోదీ తెలిపారు. మీ ఇళ్ల ముందు లక్ష్మణ రేఖ ఉందన్న ప్రధాని మోదీ గడప దాటి బయటకు రావొద్దన్నారు. జనతా కర్ఫ్యూను మించి ఈ 21 రోజులు దేశ ప్రజలందరూ సహకరించాలని రెండు చేతులు జోడించి ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు.

ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపారు.మరి ఈ మూడు వారాల పాటూ కొనసాగే లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలకు ఏవి అందుబాటులో ఉంటాయనే అంశంపై అందరి మదిలో ప్రశ్నలు మెదులుతున్నాయి. ఈ లాక్‌డౌన్ సమయంలో అత్యవసరమైన వస్తువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. నిత్యావసరాలు, కూరగాయలు, పాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఇవి కూడా నిర్దేశించిన సమయంలోనూ ప్రజలు కొనుగోలు చేసుకునేలా అవకాశం ఉంటుంది. కేవలం ఉదయం సమయంలోనే ఓ గంట నుంచి రెండు గంటల సమయంలో నిబంధనలు పాటిస్తూ ఒకరి తర్వాత మరొకరు మార్కెట్‌లు, షాపులకు వెళ్లాల్సి ఉంటుంది.

కచ్చితంగా సామాజిక దూరంగా పాటించాల్సిందే. ఇక తెల్ల రేషన్ కార్డు దారులకు ఆయా ప్రభుత్వాలు ఉచితంగా బియ్యం, కందిపప్పుతో పాటూ రూ.1000 నుంచి రూ.1500 వరకు అందజేస్తోంది.ఇక అత్యవసరమైన ఆస్పత్రులు, మెడికల్ షాపులకు మాత్రం ఈ లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఆస్పత్రులు 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే కొన్ని మెడికల్ షాప్‌లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. అలాగే సాయంత్రం ఏడు నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి..

ఈ సమయంలో కేవలం మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవాళ్లను మాత్రమే రాత్రిళ్లు అనుమతిస్తారు. ఈ నిబంధనలు ఎవరి ధిక్కరించినా చర్యలు తప్పవు. అలాగే బ్యాంకులు, ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. ఆలయాలు, చర్చిలు, మసీదులు కూడా మూతపడాల్సిందే.ఇక లాక్‌డౌన్ సమయంలో మద్యం షాపులు, బార్లు మూతపడతాయి. లాక్‌డౌన్ సమయంలో కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెంచితే చర్యలు తప్పవని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు హెచ్చరించాయి. ఒకవేళ ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేసేందుకు వెనకాడమంటున్నారు. అయితే ప్రజలు కూడా తమకు సహాకారం అందించాలని కోరుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి