జిల్లాలో పారిశ్రామిక ప్రోత్సాహాకాలుగా 120 పరిశ్రమలు ;3 కోట్ల 85 లక్షల మొత్తాన్ని వివిధ రాయితీలుగా అందించాము ;తూర్పకలెక్టర్
తూ. గో ;;జిల్లాలో పారిశ్రామిక ప్రోత్సాహాకాలుగా 120 పరిశ్రమలకుమని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి తెలియజేశారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ విధానగౌతమి సమావేశ హాలులో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాలు కలెక్టర్ మురళీధరరెడ్డి అధ్యక్షతన జరిగాయి. సమావేశాల్లో వివిధ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల అనుమతుల కొరకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుండి అందిన ధరఖాస్తులను సింగిల్ డెస్క్ విధానంలో జారీ చేసిన అనుమతులు, తిరస్కరణలు, పెండింగ్ అంశాలను కమిటీ సమీక్షించింది. ఇప్పటి వరకూ సింగిల్ డెస్క్ విధానం ద్వారా గత ఫిబ్రవరి నెల నుండి మార్చి 5వ తేదీ వరకూ జిల్లాలో మొత్తం 69 ధరఖాస్తులు అందగా, వీటిలో 50 ధరఖాస్తులకు అనువుతులను జారీ చేసారు. ఒక ధరఖాస్తు తిరస్కరణకు గురికాగా, మరో 18 ధరఖాస్తులు నిర్దిష్ట పరిష్కార గడువు లోపులోనే పెండింగ్ ఉన్నాయని వీటిని త్వరిత గతిన క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆయా శాఖలను కోరారు. పరిశ్రమల ప్రోత్సాహానికి జిల్లాలో 120 పారిశ్రామిక యూనిట్లకు 3 కోట్ల 85 లక్షల మొత్తాన్ని పెట్టుబడి, వడ్డీ, విద్యుత్ , స్టాండ్యూటీ, అమ్మకపు పన్ను తదితర రాయితీలుగా అందించామని, ఇందులో 72 మంది ఎస్.సి, ఎటి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఈ సదుపాయాలను పొందారని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పధకం క్రింద స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు మొత్తం 246 ధరఖాస్తులు అందయాని, ఇందులో 137 ధరఖాస్తులు జిల్లా పరిశ్రమల కేంద్రానికి, 37 కెబిఐబి కి, 38 కెవిఐసి కి, 34 కాయిర్ బోర్డ్ కు అందాయన్నారు. వీటిలో అర్హ మైన 238 ధరఖాస్తులను ఆన్ లైన్లో అప్లోడ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి తెలియజేశారు. ఆ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జియం బి.శ్రీనివాసరావు, ఎపిఐఐసి జడ్ ఎం కె.పి.సుధాకర్ , ఎపిఎస్ఎఫ్ సి ఏజియం అశోక్ నందా, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎ.రామారావు నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి