రాజమౌళి మరో క్రేజీ మల్టీ స్టారర్‌కు రంగం.../

                                                                                                               సూపర్ స్టార్ మహేశ్‌బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తారని టాక్‌...


తాజాగా ఓ రూమర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రాజమౌళి మరో క్రేజీ మల్టీ స్టారర్‌కు రంగం చుట్టారట.ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మల్టీస్టారర్ చిత్రం… ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. గతంలో ఈ సినిమా జులై 30న విడుదల కానున్నట్టు ప్రకటించారు. అయితే ఆ తరువాత దసరాకు రావొచ్చు అన్నారు. మొత్తానికి విడుదల పై సినీ బృందం ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదల చెయ్యనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. సినిమా వాయిదా పడటంతో సినిమా షూటింగ్ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. జూన్ వరకు షూటింగ్ ఉంటుందని సమాచారం. ఇది ఇలా ఉండగా రాజమౌళి తరువాత సినిమా గురించి అనేక వదంతులు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ రూమర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రాజమౌళి మరో క్రేజీ మల్టీ స్టారర్‌కు రంగం చుట్టారట. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తారని టాక్‌. చాలా సంవత్సరాల క్రితం కేఎల్ నారాయణ నిర్మాతగా ఓ చిత్రాన్ని రాజమౌళి అంగీకరించిన సంగతి తెలిసిందే. రాజమౌళి తరువాతి సినిమా ఇదేనని, ఇదే చిత్రంలో ప్రభాస్ కూడా ఉంటారని, యూవీ క్రియేషన్స్ బ్యానర్ కూడా నిర్మాతగా ఉంటుందనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సహజంగా తాను చేస్తున్న సినిమా పూర్తి కాకుండా జక్కన్న తన తరువాతి సినిమా మీద క్లారిటీ ఇవ్వడు. దానితో ఈ సినిమా మీద ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు