తమ పేర్లను ప్రజల మదిలో సువర్ణాక్షరాలతో లిఖించకోవాలి

 కాకినాడ, 25.2.2022 నవరత్నాలు ఉగాది ఇళ్ల స్థలాల బృహత్తర పంపిణీ కార్యక్రమానికి అవసరమైన భూ సేకరణ, లేఅవుట్లు, లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియలను మార్చి 10వ తేదీ నాటికి పూర్తి చేసి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయనున్నామని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ముఖ్యమంత్రికి తెలియజేసారు. మంగళవారం మద్యాహ్నం రాష్ట్ర ముఖ్యంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి జిల్లా కలెక్టర్లు ఎసిపిలతో దృశ్యశ్రవణ సమావేశం నిర్వహించి స్పందన విజ్ఞాపనల పరిష్కారం, నవరత్నాలు-ఉగాది ఇళ్ల స్థలాల పంపిణీ, హౌస్ హోల్ సర్వే ఆధారంగా కుటుంబాలను గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ వలంటీర్లతో మాపింగ్ , దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్ల స్థలాలు కల్పించే మహత్తర కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో నిర్వహించాలని, తమ పేర్లను ప్రజల మదిలో సువర్ణాక్షరాలతో లిఖించుకునేందుకు లభించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను కోరారు. ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన ప్రభుత్వ, ప్రయివేట్ భూముల సేకరణ, లే అవుట్ తయారీ ప్రక్రియలను మార్చి 1 నాటికి పూర్తి చేయాలని, అలాగే లబ్దిదారులకు లాటరీ ద్వారా ప్లాట్ ల కేటాయింపు కూడా తగినంత మందే నిర్వహించాలని ఆదేశించారు. ప్రయివేట్ భూముల సేకరణలో మానవతా దృక్పధాన్ని పాటించి, మంచి పరిహారాలను అందించాలని, తమకు అన్యాయం జరిగిందని ఏ ఒక్కరూ వేదన పడకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. పేద లందరికీ గూడు కల్పించే సత్ససంకల్పంతో చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి ఏవరి ఉసురు తగలకూడదన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా అందిన అర్జీల సమర్థ పరిష్కారం పైనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ సఫలత ఆధారపడి ఉంటుందని, అర్జీ స్వీకరణకు రశీదు ఇచ్చినట్లే పరిష్కరించిన అర్జీకి అక్నాలెడ్జిమెంట్ తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అందిన అర్జీలకు రెడ్ ఫ్లాగ్ జోడించి కలెక్టర్లు, ఎపి లకు, శాఖాధి పతులుకు పంపడం జరుగుతుందని, అర్జీని పరిష్కరించి గ్రీన్ బ్లాగ్ తో తిరిగి పం పేలా సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేయాలని ఐటి అధికారులను ఆయన కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల ఫంక్షనరీలు, వలంటీర్లు విధులకు సక్రమంగా హాజరైయ్యేట్లు పర్యవేక్షించాలని, హౌస్ హోల్ సర్వే ఆధారంగా వారి సేవలను కుటుంబాలకు మాపింగ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో చేపట్టిన దిశ పోలిస్ స్టేషన్లు, వన్ స్టాప్ సెంటర్ లు అన్నీ మార్చి 1 నాటికి పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు. సమావేశంలో అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ సందేశాలతో రూపకల్పన చేసిన వీడియో క్లిప్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ సందేశాలతో రూపకల్పన చేసిన వీడియో క్లిప్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి పాల్గొంటూ జిల్లాలో నవరత్నాలు-ఉగాది ఇళ్ల స్థలాల బృహత్తర పంపిణీకి అవసరమైన భూ సేకరణ, లే అవుట్ కార్యక్రమాలను మార్చి 10 నాటికి పూర్తి చేస్తామని, ప్రయివేట్ భూములను కన్సెంట్ తోనే సేకరిస్తున్నామని తెలియజేసారు. కాకినాడలో 170 ఉప్పు ముడుల భూములను ఇచ్చేందుకు సాల్ శాఖ అంగీకారం తెలిపిందని మరో 200 ఎకరాలు ఇచ్చేందుకు సంప్రతింపులు జరుపుతున్నావున్నారు. స్థలాలు తగినంత అందుబాటులో ఉన్నచోట ప్లాట్ ల కేటాయిస్తున్నామని, తప్పని సరైన చోట్ల మాత్రమే జి ప్లస్ శైలి ప్రతిపాదిస్తున్నామని ముఖ్యమంత్రికి తెలిపారు. జిల్లా ఎసిపి అద్నాన్ నయీమ్ అస్మి సమావేశంలో పాల్గొని జిల్లాలో ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయిలో పనిచేస్తోందని, గడచిన 10 రోజుల్లో 5 కేసులు నమోదు కాగా వాటి పై చట్టం ప్రకారం నిర్దిష్ట కాలపరిధిలో విచారణ పూర్తికి చర్యలు గైకొంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 బి.రాజకుమారి, డిఆర్ ఓ సి హెచ్ .సత్తిబాబు, జడ్ పి సిఈఓ యం.జ్యోతి, డిడిఆర్ డి ఏ పిడి హరిహరనాద్ , డిపిఓ నాగేశ్వరనాయక్ , హౌసింగ్ పిడి విరేశ్వరప్రసాద్ , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు