ఆర్యవైశ్య మహిళాసంఘ నూతన కార్యవర్గం
అమలాపురం : అమలాపురం ఆర్యవైశ్య మహిళాసంఘం సమావేశం స్థానిక పచ్చిగోళ్ల జనార్ధనరావు కళ్యాణ మండపంలో పచ్చిపులు సు పద్మ అధ్యక్షతన జరిగింది. వరదా సత్యవతి జ్యోతి ప్రజ్వల నచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2020-`21 సంత్సవరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా మట్టపల్లి మీనా, కార్యదర్శిగా మండవిల్లి భవానీ, కోశాధికారిగా మోటమర్రి సుబ్బల క్ష్మి(బేబి)ను ఎన్నుకున్నారు. అనంతరం అమలాపురం ఆర్యవైశ్య మహిళా సంఘం వ్యవస్ధాపక అధ్యక్షురాలు పచ్చిగోళ్ల రత్నమాల నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే శ్రీలితా భక్తమండలి అధ్యక్షురాలిగా యెండూరి శ్రీనివాస్‌కుమారి, కార్యదర్శిగా నంబూరి సత్యత్రిపురను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యెండూరి రాఘవకుమారి, నూలు అనురాధ, నూలు వరలక్ష్మి, కోదాడి సుమ, పచ్చిగోళ్ల సత్యశ్రీ, నంబూరి ఎస్‌ఆర్.లక్ష్మి, బచ్చు పార్వతి, పచ్చిగోళ్ల సుధ, నంబూరి రమాసుందరి తదితరు లు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియచేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి