'కాలనీపార్కులను' మున్సిపల్ కార్పోరేషనే నిర్వహించాలి!!
కాకినాడ ';నగరపాలకసంస్థ నిర్వాహణలో 8 పెద్దపార్కు లు 40కాలనీపార్కులుండగా.. 21కాలనీ పార్కులను కార్పోరేషన్ నిర్వహణ లేకుండా (14.2.2020 అజెండా 7వ అంశం 11010/2019/G2) వేరు చేయడం జరిగిందని ఈతీరు స్మార్ట్ సిటీ లక్షణం కాదని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. శ్రీవిద్యాకాలనీ -పద్మ నగర్- జయేంద్రనగర్- రాజేంద్ర నగర్ -లలితనగర్- విద్యుత్ నగర్- ఎస్.బి.ఐ కాలనీ- యల్.బి.నగర్ -క్రృష్ణనగర్- శాంతి నగర్ వైద్యనగర్ -సిద్థార్థనగర్ -సంజీవి రావునగర్ -వెంకటేశ్వరనగర్- నరసన్న నగర్ -ఎఫ్.సి.ఐ కాలనీ ఆర్.టి.సి కాలనీ- రామ్మో హనరాజానగర్ ప్రాంతాల్లో స్థలాలు అత్యంత ఖరీదైనవని వీటి లేఅవుట్ పార్కు స్థలాలను కార్పోరేషన్ నిర్వహణ చేయకుండా కేవలం నెలకు రు.6వేలు ఇచ్చే ప్రాతిపదికన కాలనీ సంఘాల పేరుతో కార్పోరేషన్ నిర్వాహణను వదలివేయి స్తున్న తతంగం వెనుక భవిష్యత్ లో పబ్లిక్ ప్రయివేట్ పిర్టనర్ షిప్ (పిపిపి) ముసుగుతో అభివ్రృద్థిపేరిట కార్పోరేషన్ ఆస్తుల దోపిడీకి తగిన ముందస్తు భారీ ప్రణాళిక వ్యూహత్మకంగా అమల వుతోందన్నారు. నెలకు6వేలరూపాయల బట్వాడా తో కాలనీపార్కుల నిర్వాహణ ను కాలనీ సంఘా ల పేరిట గాలికి వదిలిపెడుతున్న తీరు స్మార్ట్ సిటీగా పేరు మోసిన నగరపాలకసంస్థకు మరిన్ని తలవంపులు తెచ్చే విథంగా వుందన్నారు. కాలనీ పార్కులను కార్పోరేషన్ జనరల్ నిథులతోనే నిర్వహించాలని ప్రజల ఆస్తులు పరిరక్షించాలని కార్పోరేషన్ నిథులు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని రమణరాజు డిమాండ్ చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి