శివరాత్రి సందర్బంగా భోగిగణపతిపీఠంలో అలరించిన 'తులసిదళాలశివలింగం'..
మహశివరాత్రి సందర్భంగా భోగిగణపతిపీఠం నుండి భక్తజనబ్రృందం ఓంనమఃశ్శివాయ నామ జపంతో సామర్లకోటలోని చాణుక్యకుమారరామ భీమేశ్వరస్వామి వారి పంచారామక్షేత్రానికి కాలి నడకన తరలివెళ్ళారు. పీఠం వ్యవస్థాపకులు దూసర్లపూడి రమణరాజు వరలక్ష్మి దంపతులతో చిత్తజల్లు వీరభథ్రరావు పోలిపల్లిజగన్ బాబు మాణిక్యాంబ తదితరులు పాదయాత్రలో పాల్గొ న్నారు. యాత్రకు ముందు తొలుతగా తెల్లవారు జామున భోగి గణపతిపీఠంలో తులసిదళాలతో రూపొందించిన శివలింగానికి పూజాథికాలతో హరతులందించి శివసహస్రనామపారాయణ నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తులసిదళాల శివలింగాన్ని భక్తులు విశేషంగా దర్శించారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి