హంస , యాళి, వాహనలపై విహారం చేస్తున్న లయకారకులు ;శ్రీకాళహస్తీస్వరుడు
శ్రీకాళహస్తి; హంస , యాళి,వాహనలపై బుధవారం శ్రీకాళహస్తీశ్వరుడు మూడో నేత్రంగా కల్గిన సదాశివుడు పురాతన కాలం నాటి సువర్ణాభరణాలతో తన దేవేరితో కలసి ముగ్ధమనోహర సుందర రూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవల్లో హంసవాహనం పై సోమస్కంధవ΄ర్తి వైభవాన్ని చాటుతూ భక్త కోటికి దర్శనమిచ్చారు. ఆయన వెంబడి జ్ఞానాంబిక యాళివాహనంపై ,భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షమై కదిలారు. పంచభూతాత్మకంగా పూజలందుకునే సర్వాంతర్యామి బ్రహ్మోత్సవాల్లో నాలుగోవరోజున హంస వాహనంపై కొలువుదీరారు. వాయులింగ స్వరూపంతో పూజలందుకునే వాయులింగేశ్వరునిగా స్వామి వారు హంస వాహనంపై, విశేష అలంకరణలతో ముస్తాబైన జ్ఞానాంబిక యాళి వాహనంపై ఊరేగుతూ భక్త కోటికి దివ్యదర్శన భాగ్యం కల్పించారు. కోలాటాలు, భజనలు, మేళతాళాలు, శివభక్తుల విన్యాసాలతో శ్రీకాళహస్తిలోని చతుర్మాడ వీధులు బ్రహ్మోత్సవ శోభతో కనువిందు చేశాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి