స్మార్ట్ సిటీల్లో "నెంబర్ వన్ మురికివాడ" కాకినాడ !! .. డంపింగ్ యార్డ్ సమస్యను ముఖ్యమంత్రి పర్యటనలో పరిష్కరించాలి...సి.ఎం జగన్ కు.. దూసర్లపూడి లేఖ

 


                                                                                               కాకినాడ (తూ.గో)ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ (మార్చి23) ఉగాదిరోజు న సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండ్లస్థల పట్టాలు ఇచ్చేందుకు వస్తున్న సందర్భం గా కాకినాడ నగరానికి అతిముఖ్యమైన డంపింగ్ యార్డ్ ఏర్పాటులో నెలకొన్న సమస్యలు పరిష్కరించ డానికి ప్రత్యేకంగా చర్యలు వహించాలని సామాజిక సేవకుడు దూసర్లపూడి రమణరాజుకోరారు. ఈమేరకు  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్  కు లేఖ వ్రాశారు. 1866వ సంవత్సరంలో 25వేల మంది జనాభాతో పురపాలక సంఘంగా ఆవిర్భవించిన కాకినాడ .. 2005లో నగరపాలక సంస్థగా రూపాంతరం చెంది ప్రస్తుతం 5లక్షల మంది జనాభాతో నివశిస్తోందని .. రోజుకు 260 మెట్రిక్ టన్నుల పైబడిన చెత్త వెలువడుతోందని .. డంపింగ్ యార్డు లేకపోవడం వలన 'స్మార్ట్ సిటీల్లో నెంబర్ వన్ మురికివాడగా' కాకినాడ నగరం మారిందని రమణరాజు పేర్కొన్నారు. గతంలో పండూరు- చెందుర్తి -చొల్లంగి -పెద్థాపురం -సామర్లకోట- ఎన్.ఎఫ్.సి.ఎల్ మరియు పోర్టు భూముల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని పూర్వ ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ అమలు సాథ్యం కాలేదని పేర్కొన్నారు. నగరాన్ని ఆనుకుని 10కి.మీ పరిథిలోవున్న  గ్రామాలు వ్యవసాయే తరంగా రియల్ ఎస్టేట్ గా మారినప్పటికీ పరిసర గ్రామాలను కాకినాడలో విలీనం చేయక పోవడం వలనఅభివ్రృద్థి జరగలేదన్నారు. డంపింగ్ యార్డు, రక్షిత మంచినీటిప్రాజెక్టులకు భూములు లభించక  పెరుగుతున్న జనాభాకు పౌరసౌకర్యాలు కల్పించ లేక కార్పోరేషన్ తల్లడిల్లుతోందన్నారు. ముఖ్య మంత్రి జగన్ కాకినాడ నగర పర్యటన లో  డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని రమణరాజు కోరారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు