సేవా మార్గం ద్వారా భగవసాన్నిధ్యం

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము, అజీమా జహెరమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా శనివారం నాడు  శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయం పిఠాపురంలో 5000 పులిహోర మరియు 5000 మంచి నీరు ప్యాకెట్లు భక్తులకు అందచేయటం జరిగింది. ఈ సందర్భంగా సేవా సంస్థ ఛైర్మన్ అహ్మద్ ఆలీషా మాట్లాడుతూ తోటి వారికి సేవ చేయటం అంటే భగవంతునికి సేవ చేసినట్లే “మానవ సేవయే మాధవ సేవ” తద్వారా మనసుకి తృప్తి కలుగుతుంది. ముక్తికి మార్గం ఏర్పడుతుంది. అందుచేత అన్నదానము, వస్త్రదానము చేసి మానవ జన్మ సార్థకత చేసుకోవాలని, సేవా మార్గం ద్వారా భగవత్ సానిధ్యానికి చేరుకోగలము అని తెలియచేసారు. ఉమర్ ఆలీషా రూరల్ డవలప్ మెంట్ ట్రస్ట్ సహకారంతో అజిమా జహెరమ్మ సేవాసంస్థ ఆధ్వర్యంలో త్వరలో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి మరియు ఆర్.ఆర్. బి. హెచ్ స్కూల్ లో త్వరలో ఆర్.ఒ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నాము. అని ఆయన తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హుస్సేన్‌షా, ఖలీల్ షా, అల్లవరపు నగేష్, డి. ప్రసాద్, ఉమా మహేశ్వరరావు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు