అన్న క్యాంటీన్ లు తెరవాలి:టీడీపీ ధర్నా
పిఠాపురం, వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే పేదలకు ఉపయోగపడే అన్న కేంటీన్లు మూసివేసిందని వెంటనే అన్న క్యాంటీన్లు తెరవాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మున్సిపల్ కల్యాణ మండపం వద్ద ఉన్న అన్న క్యాంటీన్ వద్ద ధర్నా నిర్వహించారు.పట్టణ, మండల స్థాయిలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను తీవ్ర విమర్శలతో దుమ్మెత్తి పోశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్నం భాస్కర రావు,బర్ల అప్పారావు,నల్ల శ్రీను అల్లుమల్ల విజయ భాస్కర్,కోరుప్రోలు శ్రీను,గుణ్ణం మైథిలి,భవాని తదితర టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి