భక్తులతో పోటెత్తిన వీరేశ్వర స్వామి వారి ఆలయ


మురమళ్ళ(తూ గో ): శివనామస్మరణతో భక్తిపారవశ్యంతో హరాహార మహాదేవా అంటూ  భక్తజన సందోహంతో మురమళ్ళ వీరేశ్వర స్వామి వారి ఆలయం శుక్రవారం మహాశివరాత్రి సంధర్భంగా పోటెత్తింది.మహాశివరాత్రి మహా పర్వదినం పురస్కరుంచుకొని జిల్లా నలుమూలనుండి వచ్చిన భక్తులు తెల్లవారుఘామునుండి బారులు తీరారు.దగ్గరలో ఉన్న పవిత్ర వృద్ద గౌతమీ నదీస్నానాలు ఆచరించి స్వామి వారి అమ్మవారిని దర్చించుకొని అభిషేకాలు నిర్వహించుకొన్నారు. మెడికల్ కాంప్,స్వామి వారి అభిషేకం తిలకించేందుకు ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేశారు, ప్రధామాభిషేకంగా పంచామృతాల అభిషేకంలో 182 మంది భక్తులు పాల్గొన్నారు.938 నిత్యాభిషేకాలు జరిగాయి ద్వాదశ పుష్కర నదీజలాభిషేకంలో 1141 భక్తులు పాల్గొన్నారు.ఈరోజు ఆదాయం లక్ష తొమ్మిదివేల నూట అరయై మూడు రూపాయలు సమకూరింది. దేవాదాయ శాఖ అమలాపురం పర్యవేక్షకులు శ్రీ గుర్రం ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.  



ఘనంగా పుస్కార నదీ జలాభిషేకం :  భారతదేశంలో పుష్కరాలు జరిగే 12 నదీ పుణ్య జలాతో మహాశివరాత్రి మహాపర్వదినం సంధర్భంగా వీరేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించారు ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ నాగాభట్ల రామకృష్ణ మూర్తి ఆద్వర్యం అర్చకులు శ్రీ యనమండ్ర సుబ్బారావు పర్యవేక్షణలో ఈకార్యక్రమం జరిగింది.కార్యక్రమంలో భాగంగా తొలుత జలాతో గ్రామోత్సవం జరిపారు,గణపతి పూజ,.మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,అనంతరం నదీజలాతో అభిషేకం జరిపి బిల్వార్చన జరిపారు.కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ శ్రీ పెన్మత్స కామరాజు ,కార్యనిర్వహానాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మినారాయణ, శ్రీ కాళే రాజబాబు ,శ్రీ ధుళిపూడి చక్రం ధర్మకర్త మండలి సభ్యులు శ్రీ ఓలేటి సూర్యప్రకాశరావు,శ్రీమతి చింతలపూడి పద్మ,శ్రీ భూపతిరాజు శివకుమార్ వర్మ, శ్రీ నడింపల్లి సూర్యనారాయణ రాజు, శ్రీమతి రేవు దుర్గ,శ్రీమతి శీలం పార్వతి,శ్రీమతి కోమనపల్లి లక్ష్మి,శ్రీమతి మామిడిశెట్టి అనంతాలక్ష్మి ,పెటేటివీరేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.



వీరేశ్వర స్వామి వారిని దర్శించుకొన్న ప్రముఖులు: మహాశివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకొని, సాంఘీక సంక్షేమ శాఖామాత్యులు శ్రీ పినేపే విశ్వరూప్, స్థానిక శాసన సభ్యులు శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు తొలుత వీరికి ఆలయ ఛైర్మన్ శ్రీ పెన్మత్స కామరాజు,కార్యనిర్వహానాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మి నారాయణ ఘనస్వాగతం పలికారు అనంతరం ఆలయ మర్యాదలతో దుశ్శాలువతోసత్కరించి స్వామి వారి  న్యాయ మూర్తి శ్రీ బులుసు శివశంకర్ స్వామి వారిని  దర్శింకొని అభిషేకంలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీ దుర్గా ప్రసాద్ దర్శించుకొన్నవారిలో ఉన్నారు.



ప్రత్యేక ఏర్పాట్లు : మహాశివరాత్రి మహా పర్వదినం సంధర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లు చేశారు ఆలయ ఛైర్మన్ శ్రీ పెన్మత్స కామరాజు,కార్యనిర్వహానాధికారి మాచిరాజు లక్ష్మి నారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.  ప్రత్యేక క్యూలైను చంటి పిల్లలకు పాలు,బిస్కట్లు అందించారు.



సంస్కృతిక కార్యక్రమాలు  :  ఉత్సవాలలో భాగంగా తెల్లవారుఘామునుండి ఆలయ ఆవరణలో పలుసంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.అమలాపురం చెందిన చంద్రశేఖర్ స్వామి భజన మండలిచే భక్తి గీతాలు వంటి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకొన్నాయి.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు