మహనీయుల సేవలు భావితరాలకఆదర్శం ;మంత్రి కన్నబాబు
ఉమర్ ఆలీషా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కన్నబాబు మానవతావాది అయిన ఉమర్ ఆలీషా సేవలు అందరికి ఆదర్శప్రాయమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖామాత్యులు కురసాల కన్నబాబు అన్నారు. ఉమర్ఆలీషా జయంతి సందర్భంగా కాకినాడ బోట్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి మంత్రి కన్నబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మానవతావాది అయిన ఉమర్ ఆలీషా సేవలను గుర్తించి అప్పట్లోనే అలీఘడ్ యూనివర్సిటీ మౌళ్వి బిరుదుతో సత్కరించిందన్నారు. అలాంటి మహానీయుల సేవలు భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో ఆయన విగ్రహాన్ని కాకినాడ బోట్ క్లబ్ లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు బట్టలు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి