ఆదిత్య గంగరాజు నగర్లో జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు

 జాతీయ సైన్సు దినోత్సవ వేడుకలు ఆదిత్య పాఠశాల, గంగరాజు నగర్ లో కన్నుల పండుగగా జరిగాయి. విద్యార్థులు తయారుచేసిన హైడ్రోపోనిక్స్, ఆటోమేటెడ్ స్ట్రీట్ లైట్స్, రోబోట్, ఎలిఫెంట్ టూత్ పేస్ట్ మున్నగు అంశాలతో కూడిన సుమారు 60 సైన్సు ప్రోజెక్టులను కాకినాడ రూరల్ ఎమ్.ఇ.ఒఎల్.గణేష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జిజ్ఞాసతో పాఠ్యాంశాలను అర్థం చేసుకోవాలని తెలిపారు. విశిష్ట అతిధిగా విచ్చేసిన రేవతి సైన్స్ ఫౌండేషన్ చైర్మన్ కె.కృష్ణ సాయి విద్యార్ధులనుద్దేశించి మాట్లాడుతూ పాఠశాల స్థాయినుండి ప్రయోగాత్మకంగా విద్యను అభ్యసించి శాస్త్ర సాంకేతిక రంగాలలో అత్యుత్తమ ప్రతిభను కనపరచి దేశం గర్వించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుతూహలం, పరిశీలన, పాఠముల యందు అభిరుచి విద్యార్థులకు జ్ఞానం సంపాదించు కోవడానికి ఎంతగానో దోహద పడతాయని ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ, జె.ఎన్.టి.యు విజిటింగ్ ప్రోఫెసర్ కె.వెంకటరత్నం తెలిపారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలకు తమ ఆలోచనా శక్తిని జోడించి ఎంతో ఉత్సాహంగా ప్రాజెక్టులను తయారు చేసిన విద్యార్ధులను ఆదిత్య విద్యా సంస్థల వైస్ ఛైర్మన్  ఎన్.కె.దీపక్ రెడ్డి అభినందించారు. సైన్సు దినోత్సవ సందర్భంగా తమ విద్యార్ధులకు సైన్సు ప్రోజెక్టులు, సైన్సు క్విజ్ పోటీలు నిర్వహించామని ప్రిన్సిపాల్  జె.మొయిన తెలిపారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు