ఇళ్ల స్థలాల భూములను పరిశీలించిన కమిషనర్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న
కార్యక్రమాలను పరిశీలనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని స్థలాలను పరిశీలించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ప్రత్యేక కమీషనర్ హరినారాయణ తెలిపారు. శుక్రవారం స్పెషల్ కమీషనర్ హరినారాయణ, జాయింట్ కలెక్టరు జి.లక్ష్మీశ, ఆర్డీవో ఎ.జి.చిన్నికృష్ణ, కాకినాడ మున్సిపల్ కమీషనర్ కె.రమేష్ తో కలిసి ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాల ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్పెషల్ కమీషనర్ తాళ్లరేవు మండలం కోరంగి, తాళ్లరేవు గ్రామాలలో పేదల కోసం కేటాయించిన స్థలాలలో గుర్తించిన లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటికే ఈ ప్రాంతాలలో సర్వే చేసి ప్లాట్లుగా తీర్చిదిద్దడం జరిగిందని లబ్ధిదారులు చక్కటి గృహా నిర్మాణాలు చేపట్టుకోవాలని సూచించారు. తాళ్లరేవు గ్రామంలో ఇంకా ప్రభుత్వ భూమి ఉందని ఆ భూముల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల ప్లాట్లు ఇవ్వాలని స్థానికులు కోరగా తహశీల్దారును వెంటనే ఆ స్థలాలను పరిశీలించి గృహా నిర్మాణాలకు కావలసిన ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ప్రత్యేక కమీషనర్ హరినారాయణ పేర్కొన్నారు. అనంతరం అక్కడ నుండి బయలుదేరి పోర్టు ల్యాండ్ కు చేరుకుని సుమారు 120 ఎకరాల్లో ముఖ్యమంత్రిచే ఉగాది రోజున ప్రారంభించే ఇళ్ల స్థలాల ప్రాంతాన్ని పరిశీలించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో భూమి చదును జరుగుతుందని త్వరలో ప్లాట్లు క్రింద తీర్చిదిద్దాలని కమీషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి