అవ్వాతాతలు డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి ;ఎమ్మెల్యే పొన్నాడ

ఐ.పోలవరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు మూడో దశ ఫిబ్రవరి 18, 2020 నుంచి జులై 31, 2020 వరకు గౌరవ ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడా.  వెంకట సతీష్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడినది ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా హాజరైన గౌరవ శాసనసభ్యులు   పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ 60 సంవత్సరములు దాటిన అవ్వాతాతలు అందరూ కూడా అర్హులైన వారు ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలని సమగ్ర ఆధునిక వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చని ఉచిత కంటి అద్దాలు మందులు మరియు అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు అందిస్తారని తెలియజేశారు మొదటి దశ రెండవ దశలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించటం ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయుట జరిగినదని అవసరమైన విద్యార్థులకు పరీక్షల అనంతరం వేసవి సెలవులలో  ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని తెలియజేశారు అవసరమైన వారందరికీ కూడా కంటి పరీక్షల అనంతరం కళ్ళజోళ్ళు వాలంటీర్లు ద్వారా పంపిణీ చేస్తామని తెలియజేశారు జులై 31 లోగా నియోజకవర్గం అంతా పరీక్షలు పూర్తి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి  యస్ మధుసూదన్ మండల తహశీల్దారు హాజిన్    హుస్సేన్ వైద్యాధికారులు  ఆదిత్య పవన్,   కిరణ్ రాజు సి హెచ్ ఓ, హెల్త్ సూపర్  వైజర్లు ఎం పి హెచ్ వో లు హెల్త్ అసిస్టెంట్లు  ఎ ఎన్ ఏం  లు, ఆశా కార్యకర్తలు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఐ పోలవరం గ్రామమునకు సంబంధించిన ప్రజలు అధిక సంఖ్యలో వృద్ధులు పాల్గొని ప్రాథమిక కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ పిన్నమరాజు  వెంకటపతి రాజు  డీసీఎంఎస్ చైర్మన్  దున్న జనార్ధన రావు   దంతులూరి రాఘవ రాజు పెను   మత్స  వాసు రాజు ఢిల్లీ నారాయణ  కాలే రాజబాబు ధూళిపూడి చక్రం  సఖి లే వెంకటేశ్వర రావు  విత్తనాల శ్రీను కొర్లపాటి ప్రసాద్.సాధనాల బాబురావు     మండలంలో గల సొసైటీ అధ్యక్షులు గ్రామ కమిటీల పార్టీ ప్రెసిడెంట్ లు వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు