రిజిస్ట్రేషన్ క్రమబద్దీకరణకు చర్యలు చేపట్టండి

కాకినాడ; జిల్లాలో మంచినీటి చేపల చెరువులు, ఉప్పునీటి రొయ్యల చెరువుల రిజిస్ట్రేషన్ క్రమబద్దీకరణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు మరియు మత్స్యశాఖ జిల్లా స్థాయి కమిటీ చైర్మన్ డి.మురళీధర్ రెడ్డి సంబంధిత అధి కారులను ఆదేశించారు. శనివారంనాడు కాకినాడ కలక్టరేట్ కోర్టుహాల్ లో మత్స్యశాఖ జిల్లాస్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టరు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ అనుమతి లేకుండా సాగు చేస్తున్న చేపలు, రొయ్యల చెరువులను గుర్తించి పూర్తి స్థాయిలో దరఖాస్తులు చేసిన వాటిని క్రమబద్దీ కరించుటకు చర్యలు చేపట్టాలని, లేనిచో వాటికి విద్యుత్ సరఫరాను ఎపిఈపిడిసిఎల్ ద్వారా నిలిపి వేయడాని అవసరమైన చర్యలు చేపట్టాలని కలక్టరు మత్స్యశాఖ జేడిని ఆదేశించారు. ఆక్వాజోన్ కు గుర్తింపబడిన 231 దరఖాస్తులు పరిశీలించి అనుమతులు మంజూరు చేయుటకు ఆమోదించడం జరిగిందన్నారు. అలాగే ఆక్వాజోన్లో లేకుండా గ్రామ సభల ద్వారా ఆమోదం పొంది మండల స్థాయి కమిటీ సిపార్సుతో వచ్చిన 352 దరఖాస్తుల పై చర్చించి వాటికి నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేయుటకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అదే విధంగా ఇప్పటికే అనుమతులు పొంది అంగీకార పత్రాలు సమర్పించని 540 మంది ఆక్వా రైతులకు వారం రోజులు సమయం ఇచ్చి అంగీకార పత్రాలు సమర్పించని యెడల తిరస్కరించాలని ఈ విషయంను ఆక్వా ఫార్మర్స్ అసోషియేషన్ ద్వారా, పత్రికల ద్వారా, గ్రామ సెక్రటరీల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టరు ఆదేశించారు. ఉప్పునీటి రొయ్యల సాగుకు సంబంధించి 29 దరఖాస్తులను రిజిస్ట్రేషన్ కొరకు, 51 దరఖాస్తులు రెవన్యుల్ కు ఆమోదించి కోస్టల్ ఆక్వాకల్చర్ ఆథారిటీ చెన్నైకి పంపడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని కలెక్టరు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వెనామీ రొయ్యల సాగు చేస్తున్న రాజోలు మండలం పొనమండ గ్రామానికి చెందిన రామదాసు అనే ఆక్వా రైతు యొక్క చెరువు మూసి వేయుటకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని కలెక్టరు తెలిపారు. ఇప్పటికే తిరస్కరించిన 750 దరఖాస్తుల వివరాలను ఏపి ఈ పిడిసిఎల్ కు పంపి పవర్ తొలగించుటకు తగు చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ జేడిని కలెక్టరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ-2 జి.రాజకుమారి, డిఆర్వో సీహెచ్.సత్తిబాబు, మత్స్యశాఖ జేడి జయరావు, జడ్పీ సీఈవో ఎం.జ్యోతి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎ.రామారావునాయుడు, వ్యవసాయశాఖ డిడి వి.టి.రామారావు, మత్స్యశాఖ ఏడి ఎన్.శ్రీనివాసరావు, గ్రౌండ్ వాటర్ డిడి విజయ్ కుమార్, ఆక్వా రైతు సూర్యారావు, తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు