తూర్పు గోదావరిలో బెల్ట్ షాపులపై దాడులు

                                                                  తూ .గో ;   బెల్ట్ షాపుల పై జిల్లా వ్యాప్తం గా ప్రత్యేక దాడులు తూర్పూ గోదావరి జిల్లా పరిధిలో గత సంవత్సరం అక్టోబర్ నెల నుండి ఇప్పటి వరకు ప్రత్యేక దాడులను అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ ఎక్సైజ్ పరిధిలో నిర్వహించి మొత్తం 296 కేసులు నమోదు చేసి, 303 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి 900.09 లీటర్ల అక్రమ మద్యం ను మరియు 39 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని మరియు తెలంగాణా, యానాం నుంచి అక్రమంగా సుంకం చెల్లించని మద్యం అమ్ముతున్న వ్యక్తుల పై 216 కేసులు నమోదు చేసి, 116 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి 1265.08 లీటర్ల అక్రమ మద్యం ను మరియు 16 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని మరియు కొత్త ప్రభుత్వం A.P. Prohibition Act 1995 మరియు A.P. Excise Act 1965 ల ను సవరించి నాన్ బయిలబుల్ కేసులు గా మర్చినదని తద్వారా శిక్షలు 6 నెలల నుంచి 5 సంవత్సరం ల వరకు పెంచినదని మరియు అపరాధ రుసుం మొత్తం లక్షల నుంచి 5 లక్షల వరకు మరియు బార్ల అపరాధ రుసుం విషయం లో రెండు రెట్ల లైసెన్స్ ఫీజు గ పెంచిందని, ఈ విధం గా శిక్షలు కఠినతరం చేసినారు. గ్రామ సచివాలయాల్లో మహిళా పొలిసు లు, గ్రామ వాలంటీర్లు నాటు సారా మరియు బెల్ట్ షాపులపై నిరంతర సమాచారం ఈ క్రింది ఫోన్ నెంబర్ ల తెలపాలని జిల్లా అసిస్టెంట్ కమీషనర్, Enforcement, శ్రీ. యం. జయ రాజు గారు తెలిపినారు. అసిస్టెంట్ కమీషనర్, Enforcement : 9440902258 ఎక్సైజ్ సూపరింటెండెంట్, కాకినాడ : 9440902400 ఎక్సైజ్ సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం : 9440902408 ఎక్సైజ్ సూపరింటెండెంట్, అమలాపురం : 9440902418 State Toll Free No. : 14500


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు