ఫౌండేషన్ సేవలకు అత్యున్నతమైన అవార్డు : డా.రావు
కాకినాడ ; అంతర్జాతీయ రోటరీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ది రోటరీ ఫౌండేషన్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డు ప్రధానం చేయడం తనకు ఎంతో ఆనందంగాను యిప్పటివరకు రోటరీకి అందించిన సేవలకు పురస్కారంగా భావిస్తున్నానని పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రోటర గోల్డెన్ జూబ్లీ క్లబ్ పూర్వ అధ్యక్షులు డా. ఎస్.వి.ఎస్. రావు అన్నారు. ఈ అవార్డుకు ఎంపికచేసి కలకత్తా రోటరీ ఇండియా సెంటినేరియల్ సమ్మిట్లో డిస్ట్రిక్ట్ గవర్నర్ వీరభద్రారెడ్డికి అందజేసారని ఈ సందర్భంగా డా. రావును ఆయన చాంబర్ లో రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సభ్యుల బృందం ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపింది. బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో సభ్యులను ఉద్దేశించి డా. రావు మాట్లాడుతూ తాను అనారోగ్యరీత్యా కలకత్తా సదస్సుకు హాజరు కాకపోవడం జరిగిందని అయితే అత్యున్నతమైన అవార్డును చైర్మన్ గ్యారీహువాంగ్ ప్రకటించి అవార్డును డి.జి. బాబికి అందించారని అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. తాను రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఉన్న సమయంలో డిస్ట్రిక్ట్ లో చేసిన వివిధ సేవాకార్యక్రమాల నిర్వహణకు ఈ అత్యున్నత ప్రతిష్టాత్మకమైన రోటరీ అవార్డుకు ఎంపికచేయడం జరిగిందని రోటరీ డిస్ట్రిక్ట్ తరపున నైజీరియాకు మెడికల్ మిషన్ వైద్యుల బృందం ఎంపికచేసి ఆ దేశానికి పంపించి అక్కడి ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు సుమారు 70వేల డాలర్లు ఖర్చుచేయడం జరిగిందని రోటరీ ఫౌండేషన్ ద్వారా ఇంతటి గొప్ప సేవ చేయడానికి అవకాశం కలిగిందన్నారు. రోటరీ ఫౌండేషన్ కి అందించే విరాళాలు ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమం రూపంలో సద్వినియోగం చేయడమే ఫౌండేషన్ ప్రధాన ఆశయమని డా. రావు వివరించారు. కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించేందుకు సుమారు లక్ష డాలర్లను అందించడం జరిగిందని అదేవిధంగా విశాఖ నగరంలో విశాఖ పోర్టు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 40వేల డాలర్ల వ్యయంతో 51 పాఠశాలలందు ఓటరు మరియు శానిటేషన్ కార్యక్రమాల నిర్వహణకు నిధులు అందించామని చెప్పారు. అదేవిధంగా విశాఖ నగరంలో హెూమియో బాబా క్యాన్సర్ హాస్పటల్ కు సుమారు 50వేల డాలర్ల విలువచేసే క్యాన్సర్ నివారణా పరికరాలను అందించడం జరిగిందని అదేవిధంగా ఇదే కేంద్రానికి డయాలసిస్ మిషన్ కూడా మంజూరు చేసామని డా. రావు వివరించారు. రాజమండ్రి రోటరీ క్లబ్ కు ప్రముఖ ఆడిటర్ భాస్కరామ్ 2కోట్ల రూ|| విరాళాన్ని ఫౌండేషన్ కు అందించిందేంకు చేసిన ప్రోత్సాహం ఫలించిందని ఆయన ఆర్చ్ క్లబ్ సభ్యునిగా గర్తింపు పొందడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. దక్షిణ భారత దేశంలోఎండోమెంట్ ఫండ్ ను సేకరించడంలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలబడిందని డా. రావు వివరించారు. అదేవిధంగా తాను డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఉన్న సమయంలో రోటరీ ఖ్యాతిని పెంచే విధంగా చేసిన క్యాక్రమాలకు అంతర్జాతీయ పబ్లిక్ ఇమేజ్ అవార్డునుకూడా తాను స్వీకచిండం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు. రోటరీ సంస్థకు సేవలు అందించడానికి తమ కుటుంబ సభ్యులుకూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించడంవల్లే అత్యున్నత అవార్డు స్వీకరించేందుకు ఎదగడం జరిగిందని మనసులో ఉన్న మాటను వ్యక్తంచేసారు. ఇంతటి అవార్డు అందుకోవడానికి సహకరించిన డిస్ట్రిక్ట్ లో ఉ న్న అన్ని రోటరీ క్లబ్ ల సభ్యులకు డా. రావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటు రోటరీ వంటి సంస్థలో సేవలు అందించడం ద్వారా సమాజానికి ఎంతో మేలు చేసినవారమవుతామన్న ఆలోచనతో యువ రొటేరియన్లు క్లబ్ లో సభ్యత్వాన్ని స్వీకరించి సంస్థను మరింత పటిష్టం చేయల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షులు డా. సతీష్ మాట్లాడుతూ గోల్డెన్ జూబ్లీ క్లబ్ కు ప్రత్యేక గుర్తింపు ఈ అవార్డుద్వారా మరొకసారి వచ్చిందని అందుకు డా. రావు చేసిన సేవలు మరియు డిస్ట్రిక్ట్ లో అన్ని క్లట్లను ప్రోత్సహించడంలో చూపిన చొరవే ఇందుకు కారణమని కొనియాడారు. క్లబ్ కార్యదర్శి అజయ్ రెడ్డి మాట్లాడుతూ వైద్యవృత్తిలో జాతీయ అంతర్జాతీయ స్థాయి అవార్డులు పొందిన డా. రావుకు రోటరీ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక అవార్డు అందజేయడం రొటేరియన్లుగా తామందరు ఆనందాన్ని పొందుతున్నామన్నారు . రోటరీ సేవలు అందించడంలోను డా.రావు ఎంతో కృషి చేసారని డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఎవరు నిర్వహించని విధంగా సేవా కార్యక్రమాల రూపకల్పన మరియు ఆచరణలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంవల్లే ఇంతటి గుర్తింపు వచ్చిందన్నారు. డా. రావు సేవలు మాలాంటి రొటేరియన్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పారు. కారక్రమంలో క్లబ్ పూర్వాధ్యక్షులు డా. నవీన్, డా. రామకృష్ణ, ఉదయభాను, కోశాధికారి నల్లమిల్లి మాచారెడ్డి, పరశురామ్, ప్రెసిడెంట్ ఎలక్ట్ పద్దరాజు, జి.కె. శ్రీనివాస్, ఆవాలమూర్తి, చార్మినార్ వర్మ, సత్తిరవిరెడ్డి, అబ్బాయిరెడ్డి, నాని, సూర్యనారాయణ, బళ్ల చంద్రశేఖర్ ఎమ్. వివేక్, లంకసాయిబాబు, గొడవర్తి సత్యమూర్తి, నేతి నాగేశ్వరరావుతోపాటు భారీ సంఖ్యలో సభ్యులు పాల్గొని డా. రావును సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి