యంగ్ వరల్డ్ క్విజ్ లో ఆదిత్య విద్యార్థుల ప్రతిభ
కాకినాడ ;వైజాగ్ లో 24-02-2020వ తేదిన జరిగిన ప్రఖ్యాత హిందూ యంగ్ వరల్డ్ సీనియర్స్ క్విజ్ స్థానిక గంగరాజునగర్ లో గల ఆదిత్యా టాలెంటు స్కూల్ విద్యార్థులు బి.షణ్ముణ్ ప్రీతమ్, కె. జయేష్ సాయిలు ప్రథమ స్థానాన్ని, మరియు జూనియర్స్ క్విజ్ లో యమ్.డి.అమన్ ఆలి, ఎన్.మనోరంజన్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా, తూర్పుగోదావరి పాఠశాలలకు చెందిన సుమారు 371 టీమ్ లు పాల్గొన్న ఈ క్విజ్ లో వ్రాత పరీక్షలో నెగ్గిన మొదటి ఆరు టీములకు ప్రఖ్యాత క్విజ్ మాష్టర్ వి.వి.రమణన్ క్విజ్ నిర్వహించారు. విజయం పొందిన విద్యార్ధులకు సైకిల్స్, వివిధ రకాల గిఫ్ట్ హేంపర్స్ యిచ్చారని ప్రిన్సిపాల్ జె.మొయినా తెలిపారు. ఈ విజయం సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయ వర్గాన్ని ఛైర్మన్ శ్రీ ఎన్.శేషారెడ్డి మరియు సెక్రటరీ ఎన్.కె.దీపక్ రెడ్డి గారు అభినందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి