జగనన్న చేదోడు సక్రమంగఅమలు చేయండి

తూ .గో ;ఐ.పోలవరం.. మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు జగనన్న చేదోడు, జగనన్న విద్యా దీవెన, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు బయోమెట్రిక్ హాజరు, ఈ సర్వీసులు, సర్వీసులో రిక్వెస్ట్ లు, స్పందన మొదలగు విషయాలపై ఆ గ్రామ కార్యదర్శులుకు, వెల్ఫేర్ అసిస్టెంట్ లకు, డిజిటల్ అసిస్టెంట్ లకు ఐ పోలవరం మండల ఎంపీడీవో ఎస్ మధుసూదన్ వారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీవో మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న చేదోడు పథకము నకు సక్రమముగా అమలు చేయుటకు ప్రభుత్వం వారు ఇచ్చిన మార్గదర్శక సూత్రములు అనుసరించి ఎంపిక చేసిన లబ్ధిదారులను ఈనెల 28వ తేదీ వరకూ మరియొక సారి విచారించి అర్హత గల షాపులు ఉన్న రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్ లకు, ఆర్థిక సహాయము మంజూరు చేయవలసిందిగా కోరారు. ఎంపిక చేసిన జాబితాలు టైం షెడ్యూల్ ప్రకారం గ్రామ, వార్డు, సచివాలయంలో సామాజిక తనిఖీ కొరకు సమర్పించవలసిన ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్గదర్శక సూత్రములు కారము కేవలం ప్రభుత్వం నుండి జగనన్న చేదోడు పథకము ద్వారా మంజూరు చేయు ఆర్థిక సహాయం కొరకు మాత్రమే తాత్కాలికమైన షాపులు చూపించి వారు వీరి ప్రధాన వృత్తి లో కొనసాగుతున్న వ్యక్తులు అనర్హులని ఎంపీడీవో ఈ సందర్భంగా తెలియజేశారు. తదుపరి నవరత్నాల లో భాగంగా అందరికీ ఇల్లు అనే పథకంలో హౌసింగ్ సిబ్బంది తోపాటు గ్రామ సచివాలయ సిబ్బంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్ లు, వెల్ఫేర్ అసిస్టెంట్ లను విధులలో భాగస్వాములను చేయుచు రాబోయే నాలుగు సంవత్సరాలలో 25 లక్షల మందికి ఇల్లు కట్టించాలని ప్రభుత్వం కల్పించిన అందుకు ఈ పథకం సంబంధిత సిబ్బంది కి అవగాహన కార్యక్రమము నిర్వహించి, వారి యొక్క విధులు బాధ్యతలను హౌసింగ్ ఏఈ ఎండి సంసుద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలనాధికారి వి హెచ్ ఎస్ ఎస్ ఆర్ సుబ్రహ్మణ్యం, విస్తరణాధికారి మూర్తి, అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు