దేశ అభివృద్ధికి సైన్స్ కీలకం ;మంత్రి కన్నబాబు

కాకినాడ ;జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సర్.సి.వి.రామన్ దేశానికి అందించిన సేవలు మరువ లేమని రాష్ట్ర వ్యవసాయ, సహాకార, మార్కెటింగ్ శాఖామాత్యులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్య పేటలోని చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి మంత్రి కన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా కన్నబాబు మాట్లాడుతూ మానవతావాది అయిన సి.వి. రామన్ సేవలకు గుర్తుగా ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ దినోత్సవం రోజున స్మరించుకోవడం ఎంతైనా అవసరం వుందన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు సైన్స్ ఫెర్స్ ఆవశ్యకత ఎంతైనా వుందన్నారు. విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రదర్శించడమే కాకుండా వారు ప్రదర్శించిన అంశాలపై వివరణ ఇవ్వడం ద్వారా వారి పరిజ్ఞానం మరింత పెరుగుతుందని మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను తిలకించి విద్యార్థులతో ముచ్చటించారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు