పాఠశాలకు సైన్స్ పరికరాలు బహుకరణ
కాకినాడ : వి.బి.వి.ఆర్. చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం. స్థానిక జగన్నాధపురం యం.యస్.యస్. చారిటీసు ఎయిడెడ్ ఉన్నత పాఠశాలకు వి.బి.వి.ఆర్. చారిటబుల్ ఫౌండేషన్ సైన్స్ పరికరాలను గురువారం నాడు అందించారు. ఈ పరికరాలు సుమారు రూ. 25,000/- రూపాయలు విలువ చేస్తాయి. సైన్స్ నమూనాలు, సైన్స్ చార్టులు, గణిత నమూనాలు మరియు కంప్యూటర్‌ను అందించారు. పాఠశాల పూర్వ విద్యార్ధి ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉంటున్న కె. సత్యనారాయణ ఈ పరికరాలను అందించారు. - ఈ సందర్భముగా యం.యస్.యన్. చారిటీసు కార్యనిర్వాహణాధికారి పి.వి. చలపతిరావు మాట్లాడుతూ విద్యార్ధుల కొరకు సహకారం అందించడం అభినందనీయం అన్నారు. ప్రతి విద్యార్ధి క్రమశిక్షణతో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం.యస్. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సైన్స్ పరికరాలను ఉపయోగించుకుని ప్రతి విద్యార్ధి శాస్త్రవేత్తగా ఎదగాలన్నారు. ఆప్ కాస్ట్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్ సి.వి. రామన్ అందరికి ఆదర్శప్రాయుడన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి