ఘనంగా శివపార్వతుల  కళ్యాణం 



పెదపూడి మండలంలో ని 18  గ్రామాలలో  కొలువుదీరిన  శివపార్వతుల ఆలయాలలో  స్వామివారి దివ్య కల్యాణం బుధవారం ఘనంగా జరిపారు. గొల్లలమామిడాడ గ్రామంలో గల మాణిక్యాంబ భీమేశ్వరస్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ద్వారంపూడి వీర రాఘవులు అనే పాపిరెడ్డి, సత్యవతి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని  విద్యుత్  దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భారీ బాణాసంచా కాల్చారు.శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని డి వి ఆర్ ఎ పాపిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్దంకి ముక్తేశ్వరరావు, గాజంకి వెంకట రమణ,ద్వారంపూడి వెంకటరెడ్డి (చింతపండు),ద్వారంపూడి ప్రబాకరరెడ్డి( హంస  ), మాజీ జెడ్ పిటిసి సత్తి భగవాన్ రెడ్డి,  చింతా దొరబాబు, ఛాంబర్ ఛైర్మన్  ద్వారంపూడి వెంకటరెడ్డి, చింతా దొరబాబు యూత్ సభ్యులు పాల్గొన్నారు


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు