చిరువర్తకులపై రు.400/-ల మున్సిపల్ ఫీజు పెంపు తగదు!! గుర్తింపుకార్డులు బ్యాంకురుణాలతో జనతాదుకాణాలు నిర్మించాలి : దూసర్లపూడిరమణరాజు
చిరువ్యాపారులనుండి వసూలుచేసే మున్సిపల్ ఫీజును రు.250/- లనుండిరు.400/-లకు పెంపు(14.2.2020 అజెండా16వ అంశం2154/ 2000 /E1) చేయడం తగదని మాజీమున్సిపల్ కౌన్సిలర్ దూసర్లపూడిరమణరాజు ఒకప్రకటనలో పేర్కొన్నా రు. కార్పోరేషన్ సాథారణనిథులను ప్రభుత్వ పనులకు ఇష్టారాజ్యంగా బదలాయిస్తూ దుబారా చేస్తున్న యంత్రాంగం చిరువ్యాపారులపై భారం మోపడం తగదన్నారు. ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా బల్ల బడ్డీ బండి పెట్టుకుని ఉపాథి పొందుతున్న చిల్లర వ్యాపారులకు గుర్తింపు కార్డులు బ్యాంకురుణాలు కల్పించాలన్నారు. స్థానికనిథులు దుర్వినియోగం కాకుండా ప్రథాన రదారుల్లో వున్న ఖాళీ స్థలాల్లో జనతాదుకాణా లు నిర్మించాలని కోరారు. టుటౌన్ -పేర్రాజుపేట -జగన్నాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిల దిగువన వున్న కానులు ఆక్రమణలకు గురవు తున్నాయని వీటిని చిరువ్యాపారాల పేరిట బడాదళారులకు రు.400 /-ల మున్సిపల్ ఫీజు వసూళ్ళ ముసుగులో దారాదత్తం చేయడం జరుగుతోందని ఈతీరు మంచివిథానం కాదని కూడా అన్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి లదిగువ కానులను ఆర్ అండ్ బి పర్యవేక్షణలో ఉంచి పరిరక్షించాలన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి