భోజనం చేయుటకు ఉపయోగపడే ఆకులు

🌟మన హిందూ సనాతన ధర్మమును నందు.. ప్రతీ యొక్క విషయంలోను కూడా ఒక ప్రత్యేకత, ఒక విశిష్టత వుంటుంది. వాటిలో ఒకటైన భోజనం చేయటానికి వుపయోగించే ఆకులు గురించి
🌟భోజనం చేయుటకు ఉపయోగపడే ఆకులు, వాటిలోని ఔషధ గుణాలు...
🌟అరటి ఆకు...
ఇందు భుజించటం మిక్కిలి శ్రేష్టం. కఫవాతములను హరించును . బలమును , ఆరోగ్యమును పెంచును. శరీరకాంతిని , సంభోగ శక్తిని పెంచును. ఆకలిని , దంతకాంతిని కలిగించును. పైత్యశాంతిని కలుగచేయును. శ్లేష్మ సంబంధ దోషాలు పోవును. శరీరం నొప్పులు తగ్గించును. ఉదరము నందలి పుండ్లు అనగా పెప్టిక్ అల్సర్ ను నయం చేయును.
🌟మోదుగ విస్తరి...
ఇందులో భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్తసంబంధ రోగాలు , పిత్తరోగములు నశించును. బుద్దిని పెంచును.
🌟మర్రి ఆకు విస్తరి...
దీని యందు భుజించిన క్రిమి రోగ నివారణ , జఠరాగ్ని వృద్ది , కుష్ఠు వ్యాధి నివారణ అగును. నేత్రదోష నివారణ అగును. వీర్యవృద్ధి కలుగును.
🌟పనస ఆకు...
దీని విస్తరి యందు భుజించిన అగ్నివృద్ధి, పిత్తహర గుణములు ఉండును.
🌟రావి ఆకు...
ఇది పిత్తశ్లేష్మ నివారణ, అగ్నివృద్ది కలిగించును. వీర్యవృద్ధి కలుగచేయును. విద్యార్జనకు మనసు కలుగచేయును.
🌟వక్క వట్ట ఆకు...
ఇది అగ్నివృద్ధిని కలుగచేయును. వాత, పిత్త రోగాలని హరించును.
🌟పైన చెప్పిన ఆకులలో భోజనం చేయడం వలన ఆయా ఆకులలో ఉండు ఔషధ గుణాలు అన్నియు మన శరీరం నందు చేరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును అని శాస్త్ర వచనం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి