3కోట్ల కార్మికులు ,12 కోట్ల మంది వారి కుటుంబాల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ;కేంద్ర మంత్రి గంగ్వార్

 కాకినాడ ;మూడున్నర కోట్ల కార్మికులు, వారి పై ఆధారపడిన 12 కోట్ల మంది కుటుంబ సభ్యుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్య నిస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలియజేశారు. బుధవారం ఉదయం స్థానికి సాంబమూర్తి నగర్ లో 110 కోట్ల నిధులతో నూతనంగా 100 పడకల ఈఎస్ఎ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ భూమి పూజ నిర్వహించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ కాకినాడలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినా, వాస్తవానికి ఇందుకు ఖర్చు చేస్తున్న నిధులు కార్మికులు సోదరులు తమ వేతనాల నుండి కంట్రిబ్యూషన్ ద్వారా సమకూర్చినవనేన్నారు. దేశంలో పనిచేస్తున్న ఈఎస్ఎ ఆసుపత్రుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఆసుపత్రులు బాగా పనిచేస్తున్నాయని, హైదాబాదు ఆసుపత్రి దేశంలో ఆదర్శంగా నిలిస్తోందన్నారు. కార్మికులు 1.75 శాతం, యజమానులు 4.25 శాతం కలిపి మొత్తం 6 శాతం కంట్రిబ్యూషన్ గా చెల్లిస్తున్నారని, ఈ మొత్తాన్ని 4 శాతానికి తగ్గించామన్నారు. కార్మిక సంక్షేమం లక్ష్యంగా దేశంలో ఈఎస్ఎ ద్వారా 154 ఆసుపత్రులు, 1500 డి స్పెన్సరీలు, 815 బ్రాంబి ఆఫీసులు, 63 రీజనల్, సబ్ రీజినల్ ఆఫీసులు పనిచేస్తున్నాయన్నారు. కాకినాడలో 7.26 ఎకరాల విస్తీర్ణంలో 110 కోట్ల నిధులతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి కాకినాడ, యానం ప్రాంతంలో పనిచేస్తున్న 63 వేల కార్మికులు, వారి పై ఆధారపడిన 2.45 లక్షల కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలను కల్పించనుందని, ఆసుపత్రి నిర్మాణం కోసం కాకినాడ యంపి వంగా గీత చేసిన కృషిని, పట్టుదలను కేంద్ర మంత్రి కొనియాడారు. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలోని ఈఎన్ఎ ఆసుపత్రులలో అభివృద్ధికి అన్ని విధాల కేంద్ర సహకారం ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ నెల 24 నుండి మార్చి 10 వ తేదీ వరకూ ఈఎన్ఏ పక్షోత్సవాలు జరుగుతున్నాయని, ఈఎ అందిస్తున్న వివిధ సేవలు, సంక్షేమాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి గంగ్వార్ కోరారు. రాష్ట్ర కార్మిక సంక్షేమం, ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ కాకినాడలో 100 పడకల ఈఎస్ఎ ఆసుపత్రి నిర్మాణాని 110 కోట్లు నిధులు కేటాయించిన కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ కు, అందుకు కృషి చేసిన స్థానిక ఎంపి వంగా గీతా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిలకు తమ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తోందని, ఇటీవల 5 కోట్ల రాష్ట్ర ప్రజల నేత్రదృష్టి పరిరక్షణకు కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఆరోగ్య శ్రీ పధకం ద్వారా ప్రతి పేదకు కార్పొరేట్ వైద్య సేవలను స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి అందుబాటులోకి తేగా, వైద్య ఖర్చు వెయ్యి దాటితే ఎంత ఖర్చయినా రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా పధకాన్ని మరింత ప్రయోజనదాయకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీర్చిదిద్దారన్నారు. అలాగే కార్మిక సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత నిస్తున్నాయన్నారు. రాష్ట్ర కార్మికుల పట్ల కేంద్ర మంత్రి ప్రత్యేక ఆ పేక్ష చూపుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇటీవలే విజయనగరంలో 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేయగా, మరో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కాకినాడలో శంకుస్థాపన చేయడం ఆనందకరమన్నారు.


రాష్ట్రానికి రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కేటాయింటాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసారు. గత ప్రభుత్వం హయాంలో ఈఎస్ఎ కుంభకోణాలతో పేద కార్మికుల ఆరోగ్య రక్షణ మందులు, పరికరాలకు నిర్దేశించిన 300 కోట్లు దోపిడీ జరిగిందని, అక్రమాలకు పాల్పడిన వారందరూ జైలుకు పోవడం తప్పదన్నారు. తమ ప్రభుత్వం అవినీతి రహితంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ఈఎస్ఎ ద్వారా అందిస్తున్న 14 రకాల సేవలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ కాకినాడలో జిజి హెచ్ తో సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ కాకినాడలో జిజి హెచ్ తో పాటు నూతనంగా నిర్మితమౌతున్న 100 పడకల ఆసుపత్రి మరో ప్రధాన ఆసుపత్రిగా నిలవనుందన్నారు. కాలుష్య పరిస్థితులలో పనిచేసే కార్మికులు ఎక్కువగా కాన్సర్ వ్యాధికి గురౌతున్న దృష్ట్యా, కాకినాడ ఈఎస్ఎ ఆసుపత్రిని కేన్సర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ గా సూపర్ స్పెషాలిటీ స్థాయితో చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.


సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిని పే విశ్వరూప్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ కాకినాడ-వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో 100 పడకల ఈఎస్ఎ ఆసుపత్రి కార్మికుల పాలిటి పెన్నిదిగా నిలువనుందని, ఆసుపత్రి కోసం యంపి వంగాగీత, ఎమ్మెల్యే డి.చంద్రశేఖరరెడ్డిలు పట్టుదలతో చేసిన కృషిని కార్మిక సోదరులు ఎన్నటికీ మరువరన్నారు. రాష్ట్ర కార్మిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.ఉదయలక్ష్మి, ఈఎస్ఎ మెడికల్ కమీషనర్ ఆర్ . కె.కఠారియా కాకినాడ ఈఎస్ఎ ఆసుపత్రిని 24 నెలల లోపు పూర్తి చేస్తామని తెలియజేశారు. ఎంపి వంగాగీత మాట్లాడుతూ 100 పడకల ఈఎస్ఎ ఆసుపత్రి మంజూరు చేసిన కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఆసుపత్రి కార్మిక సంక్షేమంలో సువర్ణ అధ్యాయానికి నాంది పలకనుందన్నారు. కార్యక్రమంలో అమలాపురం ఎంపి చింతా అనూరాధ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు , చిక్కాల రామచంద్రరావు, ఎమ్మల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, సి హెచ్ .శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర మేయర్ సుంకరపావని, డిప్యూటీ మేయర్ కాలా సత్తిబాబు, జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ, ఈఎస్ఎ రీజనల్ డైరక్టర్ వి.కాశినాధన్, స్థానిక కార్పొరేట్లు, బిజిపి, వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు