స్టేట్ లెవెల్ "విభావ-2K20" ఆదిత్య విద్యార్థిని ప్రధమ స్తానం
సేట్ లెవెల్ "విభావ-2K20" టెక్నికల్ పోటీలలో ఆదిత్య కళాశాల M.C.A విద్యార్థుల విజయకేతనం విజయవాడలో P.B.సిద్ధార్ద కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో 26-02-2020న జరిగిన సేట్ లెవెల్ "విభావ-2K20" టెక్నికల్ పోటీలలో కాకినాడ నగరంలోని ఆదిత్య స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ M.C.A విద్యార్థులు పాల్గొన్నారని ఈ టెక్నికల్ పోటీలలో 15 కళాశాలల నుండి 80 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు పాల్గొనగా అందులో ఆదిత్యలో రెండవ సంవత్సరం చదువుతున్న M.C.A విద్యార్ధిని పోతుకూచి నిహారిక మొదటి బహుమతిగా షీల్డ్, ప్రశంసాపత్రం గెలుపొందినదని మరియు బి.ప్రసాద్, ఎం.రఘువీర్, పి.నిహారకలు, కన్సొలేషన్ బహుమతులు గెలుపొందారని ఆదిత్య స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ప్రిన్సిపాల్ డి.బ్యూలా తెలియజేసారు. బహుమతులు గెలుపొందిన విద్యార్ధులను ఆదిత్య డిగ్రీ మరియు P.G కళాశాలల అకడమిక్ డైరెక్టర్ డా||బి.ఇ.వి.ఎల్. నాయుడు, ఆదిత్య విద్యా సంస్థలు ఛైర్మన్ : ఎన్.శేషారెడ్డి, సెక్రటరీ : ఎన్.కృష్ణదీపక్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జి.సత్య మరియు అద్యాపక అద్యాపకేతర సిబ్బంది అభినందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి