2021 జనగణనకు అవగాహన పెంపొందించుకోండి

2021 జనగణన సక్రమ నిర్వహణకు అధికారులు అందరూ తప్పనిసరిగా అవగాహణ పెంపొందించుకోవాలని రాష్ట్ర గణాంక శాఖ డైరక్టర్ ఎస్.సత్యన్నారాయణ తెలిపారు. శుక్రవారం కలెక్టరు కార్యలయంలో విధాన గౌతమీ హాలు నందు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ , అప్డేషన్ ఆఫ్ నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ మరియు సెన్సస్ 2021 పై రెండు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఎస్. సత్యనారయణ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనభా సేకరణ ముఖ్య ఉద్దేశం, జనభా గణనకు అవలంభించాల్సిన పద్ధతులపై అధికారులు అవగాహణ పెంపొందించుకోవాలన్నారు. జనగణన మరియు ఇళ్ల జాబిత , కుటుంబ సభ్యుల వివరాలు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు సేకరించాలన్నారు. జాతీయ జనభా రిజిస్టర్ లో వివరాలు నమోదు చేయలన్నారు. జిల్లాలో ఇళ్ల జాబిత , జనగణనకు చార్జ్ ఆఫీసర్స్ , సూపర్ వైజర్లు , ఇన్యూములేటర్లు వారిగ సేకరణను చేపట్టలన్నారు. ఈ సంవత్సరం జనగణనకు మొబైల్ యాప్ ద్వారా సేకరించిన వివరాలు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జనభా సేకరణ ముఖ్య ఉద్దేశం, జనభా గణనకు అవలంభించాల్సిన పద్దతులపై నేషనల్ మాస్టర్ ట్రైనర్ జివి.చంద్రకళ పవర్ పాయింట్ ప్రజెటేషన్ ద్వారా అంశాల వారిగా అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ - 2 జి. రాజకుమారి, అమలాపురం , పెద్దాపురం ఆర్డీఓ లు భవాని శంకర్, మల్లిబాబు, సిపిట రత్నబాబు , డిఆర్ సిహెచ్ సత్తిబాబు, మాస్టర్ టైనర్ డైరక్టరేట్ ఆప్ సెన్సస్ ఆపరేషన్స ఎపి, హైదారాబాదు డి.సత్యన్నారయణ, డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ డైరక్టరేట్ ఆప్ సెన్సస్ ఆపరేషన్స్ డి.బల్లారెడ్డి , ఎహెచ్ పర్వవేజ్ తో పాటు జిల్లాలోని రెవెన్యు డివిజనల్ అధికారులు, తహసీల్డర్లు,మున్సిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు