2021 జన గణనకు ఇళ్ల జాబితా మరియు కుటుంబ సభ్యుల వివరాలను సిద్ధం చేయండి ;ఏపి గణాంక శాఖ డైరెక్టరు ఎస్.సత్యనారాయణ

అమరావతి ;2021 జన గణనకు ఇళ్ల జాబితా మరియు కుటుంబ సభ్యుల వివరాలను వచ్చే ఏప్రిల్ నుండి సెప్టెంబరు 2020 సేకరించాలని ఏపి గణాంక శాఖ డైరెక్టరు ఎస్.సత్యనారాయణ జిల్లా జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారంనాడు హైదరాబాదు నుండి జాయింట్ కలెక్టరు, డిఆర్వోలు, మున్సిపల్ కమీషనర్లు, ముఖ్య గణాంకాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులు, ఆర్డీవోలు, తదితరులతో జనాభా గణనకు చేపట్టవలస్సిన చర్యల పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గణాంక శాఖ డైరెక్టరు సత్యనారాయణ మాట్లాడుతూ 2021 జన గణనకు ఇళ్ల జాబితా మరియు కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి జాతీయ జనాభా రిజిష్టరులో నమోదు చేయాలన్నారు. జన గణనకు ఎన్యూమరేటర్లు శిక్షణ ఇవ్వాలని ఫిబ్రవరి 28 నుండి మార్చి 7వ తేదీ వరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2 రోజులు చొప్పున శిక్షణ ఇవ్వాలన్నారు. ఇందుకు అవసరమైన గ్రామాలు, పట్టణాలకు సంబంధించి రిజిష్టర్లు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. అలాగే జన గణనకు అవసరమైన సాంకేతిక పరికరాల ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శిక్షణ ఇవ్వడానికి మాస్టర్ ట్రైనర్లకు ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగిందని వారు ఆయా జిల్లాల్లో నిర్ణీత తేదీలలో శిక్షణలు ఇస్తారని తెలిపారు. ఇళ్ల జాబితా, జన గణనకు ఎన్యూమరేటర్స్, సూపర్ వైజ్ను నియమించాలని డైరెక్టరు సూచించారు. వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని జాతీయ జనాభా రిజిష్టరు, బుక్ లెట్స్ ప్రచురణ మరియు ప్రచారం కొరకు తగు చర్యలు చేపట్టాలని ఇందుకు అవసరమైన నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. జన గణనకు సంబంధించి డిఆర్వోలతో పాటు బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీలలోని గ్రామాలు, మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు వివరాలు సిద్ధం చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్వో సీ హెచ్.సత్తిబాబు, మున్సిపల్ కమీషనర్ కె.రమేష్, జడ్పీ సిఈఓ ఎమ్.జ్యోతి, డిపిఓ ఎస్.వి.నాగేశ్వరనాయక్, సిపిఓ రత్నంబాబు, డిఇఓ ఎస్.అబ్రహం, ఆర్డీవో ఎస్.మల్లిబాబు, గణేశ్వరరావు, బిహెచ్.భవాని శంకర్, తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు