మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్ విభాగంలో భారత్‌కు ఒలింపిక్ బెర్త్
శనివారం నిర్వహించిన మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్ విభాగంలో భారత్‌కు ఒలింపిక్ బెర్త్ లభించింది. రాజస్థాన్‌కు చెందిన భావన జాట్ ఈ బెర్త్‌ను దక్కించుకుంది.
ఈ ఏడాది జరిగే ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి మరో అథ్లెట్ అర్హత సాధించింది. మహిళల 20 కిలో మీటర్ల రేస్ వాక్‌లో భారత్ నుంచి భావన జాట్ ఒలింపిక్ బెర్త్ దక్కించుకుంది. శనివారం జాతీయ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించగా.. ఈ పోటీల్లో సత్తాచాటిన భావన ఒలింపిక్ టైమింగ్స్‌ను అందుకుని, మెగాటోర్నీ బెర్త్‌ను పట్టేసింది.
రాజస్థాన్‌కు చెందిన భావన ఈ రేస్‌ను ఒక గంటా 29 నిమిషాల 54 సెకండ్లలో పూర్తి చేసింది. ఒలింపిక్ అర్హత ప్రమాణం (ఒక గంటా 31 నిమిషాలు) కన్నా మెరుగైన టైమింగ్‌ను అందుకున్న భావన.. ఈ ఘనత సాధించింది. ఈక్రమంలో కొత్త జాతీయ రికార్డును కూడా భావన నమోదు చేయడం విశేషం. ఈక్రమంలో తన అత్యుత్తమ వ్యక్తిగత స్కోరును కూడా భారీ తేడాతో అధిగమించడం విశేషం.
Read Also: IND vs NZ Test Series: భారత్‌కు శుభవార్త.. ఆ ప్లేయర్ జట్టులోకి..
గత అక్టోబర్‌లో తన అత్యుత్తమ టైమింగ్ గంటా 38 నిమిషాల 30 సెకండ్లను భావన నమోదు చేసింది. తాజా రేస్‌లో దాదాపు తొమ్మిది నిమిషాల టైమింగ్‌తో సవరించుకుంది. మరోవైపు ఇదే పోటీల్లో పాల్గొన్న మరో అథ్లెట్ ప్రియాంక గోస్వామి త్రుటిలో ఒలింపిక్ బెర్త్‌ను మిస్సయ్యింది. ఈ రేసును ఒక గంటా 31 నిమిషాల 36 సెకండ్లతో పూర్తి చేసిన ప్రియాంక.. 36 సెకండ్ల తేడాతో ఒలింపిక్ బెర్త్‌ను మిస్సయ్యింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ గేమ్స్ వచ్చే జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరుగుతాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి