శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయ చతుర్దశ 14 వ వార్షికోత్సవం
ముమ్మిడివరం. ముమ్మిడివరం లో మార్కెట్ సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయ చతుర్దశ 14 వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ వెల వెల పల్లి గిరీ శర్మ ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి గణపతి పూజ, ఏకాదశ రుద్రాభిషేకం, గరిక పూజ వంటి విశేష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భారీ అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి